తండ్రిని ఒడించిన నేత ఇక్కడ…తనయ నేతృత్వం అక్కడ

దిశ దశ, హైదరాబాద్:

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు… కానీ బీజేపీలో ఇది సాధ్యమేనని అంటున్నారు… తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్ పెంచుకునేందుకు కమలనాథులు వేస్తున్న ఎత్తులు అంతుచిక్కకుండా ఉంటున్నాయి. దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ ఇతర పార్టీల నాయకుల చేర్పించుకునేందుకు పెద్దపీట వేస్తోంది. తాజాగా తెలంగాణలో ఇద్దరు సీనియర్ నాయకులను చేర్పించుకోవడంతో సరి కొత్త చర్చకు తెరలేపారు బీజేపీ నాయకులు.

ఆంధ్రాలో…

బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా సీనియర్ ఎన్టీఆర్ తనయ దగ్గుపాటి పురేంధేశ్వరీ వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షులను మార్చినప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం పురంధేశ్వరికి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో పార్టీ బలోపేతం కోసం ఆమె దృష్టి సారించారు కూడా. ఇదే సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరి ద్వారా బీజేపీని బలోపేతం చేసే దిశగా జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

తెలంగాణలో…

ఇకపోతే తాజాగా తెలంగాణలో ఇద్దరు నాయకులు బీజేపీలో చేరారు శనివారం కాషాయం కండువా కప్పుకున్న వీరిలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన ట్రాక్ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేరనే చెప్పొచ్చు. 1989 ఎన్నికల్లో ఏకంగా టీడీపీ అధినేత సీనియర్ ఎన్టీఆర్ నే ఒడించిన చరిత్ర చిత్తరంజన్ దాస్ సొంతం.

వైవిధ్యమైన చర్య…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తనయ నాయకత్వం వహిస్తుండగా తెలంగాణలో ఆమె తండ్రిని ఓడించిన నేత అదే పార్టీలో చేరడం విచిత్రమనే చెప్పాలి. నాడు టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ తనయ… ఆయన్ను ఓడించిన నేత ఒకే గూటికి చేరడంతో తెలుగు రాష్ట్రాలలో సరికొత్త చర్చకు దారి తీసినట్టయింది.

You cannot copy content of this page