కేంద్ర ప్రభుత్వం ఓబీసీ బిల్లును పార్లమెంట్ లో తక్షణమే ప్రవేశపెట్టాలి..

బీసీ సంఘాల నేతలు డిమాండ్…

దిశ దశ, కరీంనగర్:

పార్లమెంట్ లో తక్షణమే ఓబీసీ బిల్లు పెట్టాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ లో బీసీ సంఘాల సమన్వయకర్త బిజిగిరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ… చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న బీసీలకు అన్యాయం చేయడం ప్రభుత్వాలకు తగదన్నారు. సమాజంలో అత్యధిక శాతం జనాభా గల బీసీల కుల గణన చేపట్టి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణమేంటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అయినప్పటికీ కూడా కేంద్ర క్యాబినెట్లో మీటింగ్ లో కూడా బీసీ బిల్లు ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. ఓబీసీలకు రావాల్సిన కోటా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఓబీసీలకు అన్యాయం జరిగితే బీసీ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిపోయారని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత గౌడ సంఘం యూత్ అధ్యక్షుడు గొడిశాల రమేష్ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సర్దార్ రణధీర్ సింగ్ రాణా, కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య,పద్మశాలి సంఘం ప్రతినిధి వొడ్నాల రాజు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు సదానందం, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్,బీసీ సంఘాల నేతలు ఆంజనేయ స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page