తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కు బ్రేకులు… రేపటి నుండి ప్రారంభం కావల్సిన గేమ్స్…

దిశ దశ, కరీంనగర్:

మరికొన్ని గంటల్లో ప్రారంభం కావల్సిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ కు అడ్డంకులు మొదలయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు క్రీడాకారులు పాల్గొననున్న ఈ క్రీడలను కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం, రీజనల్ స్పోర్ట్ సెంటర్ లో నిర్వహించేందుకు అనుమతించాలని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి స్పోర్ట్స్ అథారిటీకి లేఖ పంపించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్  నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు కూడా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు లేఖలు పంపించినట్టుగా తెలిసింది. ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 1వ తేది వరకు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లలో కరీంనగర్ పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది. దాదాపు 2500 మంది వరకు పాల్గొననున్న ఈ స్పోర్ట్స్ మీట్ కు హాజరయ్యే పోలీసు క్రీడాకారుల  కోసం ఏర్పాట్లు చేస్తున్నారు కమిషనరేట్ పోలీసులు. అయితే కొద్ది సేపటి క్రితం రెవెన్యూ అధికారులు వచ్చి ఏర్పాట్లు నిలిపివేయాలని పోలీసులకు సూచించడంతో ఖంగుతిన్నారు. అంతేకాకుండా అక్కడి గేట్లకు కూడా తాళాలు వేసి మరి అభ్యంతరం తెలపడంతో కమిషనరేట్ పోలీసు అధికారులకు ఈ సమాచారం అందించారు. ఇంటలీజెన్స్ చీఫ్ ఓపెనింగ్ సెర్మనీకి రానున్నా ఈ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు షాకివ్వడంతో పోలీసులు ఏంచేయాలో అర్థం కాక తికమకపడుుతన్నారు. ఈ విషయం గురించి హైదరాబాద్ లోని ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రేపే ప్రారంభం…

మంగళవారం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించాల్సిన క్రమంలో కలెక్టరేట్ వర్గాలు తాళలు వేసుకోవడం ఎంటన్నదే మిస్టరీగా మారింది. ఎక్కడికక్కడ తాళాలు వేయడంతో ఏర్పాట్లు చేయలేని పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్ కు అడ్డంకులు సృష్టించడానికి అసలు కారణం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోయింది.

సీఎం చేతిలోని శాఖకే షాక్… 

కరీంనగర్ లో నిర్వహించనున్న తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కు కరీంనగర్ కలెక్టరేట్ నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడం సంచలనంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే ఉన్న హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న పోలీసుల స్పోర్ట్స్ మీట్ ను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన క్రీడల విషయంలో రెవెన్యూ అదికారులు అభ్యంతరాలు చెప్తున్న తీరుపై కూడా డిస్కషన్ సాగుతోంది.

You cannot copy content of this page