దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ రూరల్ మండలంలోని దుర్శేడు మీ సేవా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నుండి ఈ సోదాలు చేపట్టారు. రెవెన్యూ అధికారులను కూడా ప్రత్యేకంగా పిలిపించి ఆరా తీస్తున్నారు. సిస్టం రికార్డులతో పాటు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తులు, జారీ చేసిన సర్టిఫికెట్ల వివరాలపై తెలుసుకుంటున్నట్టు సమాచారం. దుర్శేడు మీ సేవా కేంద్రంపై అధికారులు ప్రత్యేకంగా సోదాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఈ సోదాలకు గల కారణాలు పూర్తిగా తెలియరావడం లేదు.