దిశ దశ, కరీంనగర్:
ఎగువ ప్రాంతాల మీదుగా వస్తున్న వరద ఉధృతి కారణంగా ఉమ్మడి జిల్లాలోని మానేరు జలాశయాల గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తిన అధికారులు 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ ప్రాజెక్టుకు ఎగువ మానేరు, మూల వాగుల నుంండి లక్షా 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని వదిలారు. మిడ్ మానేరు, మోయ తుమ్మెద వాగుల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆరు గేట్ల ద్వార 12 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయితే క్రమ క్రమంగా ఈ గేట్లను సంఖ్యను పెంచి మొత్తం 40 వేల క్యసెక్కుల నీటిని దిగువకు వదిలే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుండి వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post