అటు ఎగువకు… ఇటు దిగువకు… ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన అధికారులు

దిశ దశ, రామగుండం:

గోదావరి నదిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు అదికారులు. 62 గేట్లలో 5 గేట్లను 0.5 ఎత్తులోకి ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. ఆదివారం తెల్లవారు జామును 5.30 గంటల ప్రాంతంలో గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి 13,650 క్యూసెక్కుల నీటని వదిలగా, తిరిగి 6.30 గంటల సమయంలో 13 గేట్ల ద్వారా  35,620 వేల క్యూసెక్కుల వరకు పెంచారు. 7 గంటలకు ‘ గేట్లను 1 మీటరు ఎత్తులోకి ఎత్తి దిగువ ప్రాంతానికి 64992 క్యూసెక్కుల నీటిని వదిలారు.

ఎగువ ప్రాంతానికి… 

మరోవైపున గత కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతమైన నంది పంప్ హౌజుకు కూడా నీటిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఎల్లంపల్లి నుండి ధర్మారం మండలం నందిమేడారం పంప్ హజుకు 6,300 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుండి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్ హౌజుకు, వై జంక్షన్ మీదుగా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి అనంతసాగర్ కు, లోయర్ మానేరు డ్యాంకు నీటిని వదిలారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటితోనే ఇప్పటి వరకు అధికారులు ఎగువ ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తుండడం విశేషం.

ఎస్సారెస్పీ నిల్… 

ఈ సారి శ్రీరాంసాగర్ నుండి నీటిని విడుదల చేయనప్పటికీ శ్రీపాద ఎల్లంపల్లికి మాత్రం వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి ఎల్లంపల్లికి 77545 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో వస్తుండగా ఇక్కడి నుండి 71572 వేల   క్యూసెక్కుల నీటిని ఎగువ, దిగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

You cannot copy content of this page