దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ పై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అవకతవకలకు సంబంధించిన వ్యవహారంపై విచారించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కరీంనగర్ వన్ డిపో మేనేజర్ గా పని చేస్తున్న మల్లేశంను సస్పెన్షన్ లో ఉంచాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కామారెడ్డి డిపోలో ఉన్నప్పుడు కూడా అవకతవకలు చోటు చేసుకోగా రివర్షన్ ఇచ్చి భూపాలపల్లికి బదిలీ చేశారు. ఆ తరువాత డిపో మేనేజర్ గా కరీంనగర్ వన్ డిపోలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆర్టీసీ వర్గాలు మాత్రం డిపో మేనేజర్ మల్లేశంపై వేటుకు కారణాలు ఏంటీ అన్న వివారలపై స్పష్టత ఇవ్వడం లేదు.