ఆస్కార్ చరిత్రలో తెలుగు చిత్ర పరిశ్రమ తనకంటూ ఓ పేజీ రాసుకుంది.2023 అస్కార్ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న కలను నిజం చేస్తూ.. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అంతే కాకుండా భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా ఆస్కార్ ఒడిలోకి చేరిపోయింది.
దీంతో తెలుగు ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు రెండు సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డుపై మెగాస్టార్ రామ్ చరణ్ ఎమోషనల్ పోస్టు చేశారు.
మాజీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర చరిత్రలో త్రిబుల్ ఆర్ ప్రత్యేకమైంది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నాకు ఇది నిజమేనా.. నేను కల కంటున్నానా అనే భావన కలుగుతుంది. అంతలా నమ్మలేకపోతున్నా, రాజమౌళి, కీరవాణి.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్‌కు రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌కు ధన్యవాదాలు. నా బ్రదర్ ఎన్టీఆర్, కో-స్టార్ అలియాభట్‌కు ధన్యవాదాలు.
తారక్.. నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆశపడుతున్నా. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో సపోర్ట్ అందించిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ పోస్టు చేశాడు.
https://twitter.com/AlwaysRamCharan/status/1635151004298772480?s=20