గడ్చిరోలి జిల్లాలో ఘటన
దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఇన్ ఫార్మర్ పేరిట ఒకరిని హత్య చేశారు. జిల్లాలోని భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. భామ్రాఘడ్ తాలుకా మర్దుహూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ నరోటే (26) గడ్చిరోలి జిల్లా కేంద్రంలో చదువుకుంటున్నాడు. హోలీ పర్వదినం పురస్కరించుకుని గ్రామానికి వచ్చిన సాయినాథ్ ను మావోయిస్టులు హత్య చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీస్ ఇన్ పార్మర్ అన్న అనుమానంతోనే మావోయిస్టులు సాయినాథ్ ను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి పోలీసు బలగాలు బయలుదేరాయి.