ఇంగ్లీష్ పేపర్ పంపించడమే కారణం
దిశ దశ, హైదరాబాద్:
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్ లో అపశృతి దొర్లింది. దీంతో రాష్ట్ర అధికారులు ఎకనామిక్స్ తెలుగు పేపర్ ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ కు బదులు ఇంగ్లీష్ మీడియం ఎకనామిక్స్ పేపర్ పంపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు. క్వశ్చన్ పేపర్ బెండిల్స్ పై తెలుగు మీడియం అని రాసి ఉండడంతో వాటిని హైదరాబాద్ నుండి నేరుగా జిల్లా కో ఆర్డినేటర్లకు పంపించగా అవి నేరుగా కేంద్రాలకు చేరిపోయాయి. మంగళవారం పరీక్ష నిర్వహించేందుకు 10 నిమిషాల ముందు క్వశ్చన్ పేపర్ల సీల్డ్ కవర్లను ఓపెన్ చేయగా అవి ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినవన్న సమాచారం ఆయా కేంద్రాల నుండి అధికారులకు చేరింది. దీంతో మంగళవారం నాడు నిర్వహించాల్సిన తెలుగు మీడియం ఎకనామిక్స్ పేపర్ ను తిరిగి ఈ నెల 13న నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ తెలుగు మీడియం 70 వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నట్టు సమాచారం.
Disha Dasha
1884 posts
Prev Post