మొదలైన ప్రత్యక్ష్య యుద్దం… లారీలను అడ్డుకున్న ‘గండ్ర’

రేపటి నుండి దీక్షలు… కాంగ్రెస్ మద్దతు..

దిశ దశ, భూపాలపల్లి:

మైనింగ్ కార్యకలాపాలపై ఇప్పటి వరకు న్యాయ పోరాటం జరగగా ఇప్పటి నుండి ప్రత్యక్ష్య పోరు సాగుతోంది. సహజ వనరులన దోపిడీని నిలువరించేందుకు మానేరు పరిరక్షణ సమితి న్యాయ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాలపై హై కోర్టు బ్రేకులు వేయడంతో సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో భూపాలపల్లి జిల్లాలో నడుస్తున్న ఇసుక రీచులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష్య పోరు ప్రారంభం అయింది. గురువారం భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఎన్జీటీ ఉత్తర్వులు, సుప్రీం కోర్టు స్టే ఉన్న నేపథ్యంలో ఇసుక రవాణా ఎలా జరుగుతోందంటూ ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం నుండి దీక్షలు…

ఇసుక రవాణాను ఎక్కడికక్కడ నిలిపివేయాలన్న లక్ష్యంతో ఇప్పటి వరకు చట్టాలపై ఆధారపడి న్యాయ పోరాటం చేసిన మానేరు పరిరక్షణ సమితి శుక్రవారం నుండి దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రీచుల వద్ద దీక్షలు చేపట్టి మైనింగ్ కార్యకలాపాలను ఎక్కడికక్కడ నిలవురించాలని నిర్ణయించింది. మానేరు పరిరక్షణ సమితి చేపట్టనున్న దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇసుక రీచుల్లో మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడే వారి భరతం పట్టాలని అటు ఎంపీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడంతో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రత్యక్ష్య పోరు ప్రారంభమైనట్టయింది.

ఇరుకున పెట్టిన ఎంపీఎస్…

ఇంతకాలం ఎన్జీటీని ఆశ్రయించి ఆధారాలను అందించిన ఇసుక తవ్వకాలపై న్యాయ పోరాటం చేసింది. మొదట పెద్దపల్లి జిల్లా నుండి మొదలైన పోరాటం మూడు జిల్లాలకు పాకింది. దీంతో మూడు జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న ఇసుక తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యూనల్ స్టే ఇచ్చే వరకు వేచి చూసి ఒక్కో అడుగు ముందుకేయడం ఆరంభించింది. భూపాలపల్లి జిల్లాలో అయితే మానేరు పాటు గోదావరి నదిలో నిర్వహిస్తున్న ఇసుకు రీచులను నిలిపివేయాలని ఆదేశించడం గమనార్హం. డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక తవ్వకాలు జరపడం సరికాదన్న వాదనలను కూడా మానేరు పరిరక్షణ కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది. ఇంతకాలం ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ పై పోరాటం చేసి సక్సెస్ అయిన ఎంపీఎస్ ఇక ముందు డిసిల్ట్రేషన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటోంది. కర్ణాటక చిత్రవతి నదిలో పూడిక తీత కోసం చేపట్టిన ఇసుక తరలింపుపై ఎన్జీటీ అభ్యంతరాలు చెప్పింది. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వంపై రూ. 50 కోట్ల పెనాల్టీ కూడా వేసింది. కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ఇసుక తవ్వకాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడగా పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణాలో కూడా ఇదే అంశంపై ఎన్జీటీని ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతోంది ఎంపీఎస్. కర్ణాటక చిత్రావతి రివర్ పై తీసుకున్న నిర్ణయం విధంగానే తెలంగాణ ప్రభుత్వంపై కూడా పెనాల్టి వేస్తే మాత్రం భారీ విజయం సాధించినట్టు అవుతుంది. మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి కూడా ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తుతుండడం గమనార్హం. మరో వైపున గత ఏడు నుండి ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఆధారాలను చూపిస్తూ కూడా మరిన్ని పిటిషన్లు ఎన్జీటీలో వేస్తే సర్కారు ఇరుకున పడక తప్పదు. రాష్ట్రంలోని అన్ని నదుల్లో తొలగించిన ఇసుకలో చాలా వరకు డిసిల్ట్రేషన్ పేరిటే కావడంతో పాటు పర్యావరణ అనుమతులు కూడా లేనందున ఇబ్బందులు ఎదుర్కొవలసి రాక తప్పదు.

You cannot copy content of this page