రైతు దినోత్సవాల్లో నిరసనల హోరు…

దిశ దశ, హైదరాబాద్:

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన రైతు ఉత్సవాలు నిరసనలకు వేదికగా మారాయి. రైతాంగానికి అధికార ప్రభుత్వం ఏం చేసిందో వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేపట్టిన రైతు దినోత్సవాలు పలు చోట్ల వ్యతిరేకత ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రజలకు వివరించి తమకు అనుకూలంగా మల్చుకోవాలని భావించినప్పటికీ కొన్ని చోట్ల రైతాంగం ప్రభుత్వం తీరుపై మండిపడుతోంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, భువనగిరి, నిర్మల్ జిల్లా కుభీర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన రైతు దినోత్సవాల్లో రైతులు ఆందోళనలు చేపట్టడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రైతు వేదికకు తాళం వేసిన రైతులు దినోత్సవాన్ని అడ్డుకునర్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, రైతు దినోత్సవం సభలో నిరసన వ్యక్తం చేసిన రైతులు ఏకంగా సమావేశం నుండే బయటకు వెల్లిపోయారు. వరి దాన్యం కొనుగోలు చేయడం లేదని, రుణ మాఫి కాలేదంటూ పలువురు రైతులు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎకరాకు రూ. 10 వేలు ప్రకటించినప్పటికీ సాయం నేటికీ అందలేదన్నారు. భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితిని అధికారులు, నాయకులు ఎదుర్కొన్నారు.

You cannot copy content of this page