హోమ్ డెలివరీ ఆర్డర్ చేసి… చెల్లని చెక్కులు ఇచ్చి…

దిశ దశ, హైదరాబాద్:

ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు సరికొత్త రీతిలో మోసాలకు పాల్పడడం అలవాటు చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ ద్వారా భూముల క్రయ విక్రయాలు జరిపించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన జ్యువెల్లరి షాపులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. చివరకు పోలీసుల చాకచక్యంతో అరెస్ట్ అయ్యాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… రంగారెడ్డి జిల్లా గండిపేటకు చెందిన గుంటి సుమన్ (43) గూగుల్ ద్వారా ప్రముఖ జ్యువెల్లరి షాపుల కాంటాక్ట్ నంబర్లు సేకరించాడు. లేటెస్ట్ డిజైన్లకు సంబంధించిన నగల ఫోటోలను వాట్సప్ ద్వారా పంపించాలని కోరేవాడు. వాటిలో ఖరిదైన ఆభరణాలను హోమ్ డెలివరి చేయాలని చెప్పడంతో సంబంధిత నగల షాపు నిర్వహాకులకు చెప్పేవాడు. ఆభరణం ఇంటికి చేరుకున్న తరువాత నిల్ బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు అకౌంట్, క్లోజ్ చేసిన అకౌంట్ కు సంబంధించిన చెక్కులు ఇచ్చేవాడు. అకౌంట్ పే ద్వార మాత్రమే డబ్బులు డ్రా చేసుకునే విధంగా చెక్కులను ఇచ్చేవాడు. తరువాత ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుని తప్పించుకుని తిరుగుతుండే వాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటి సమన్ కోసం రాజేంద్రనగర్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. అతని నుండి 488.939 గ్రాములు మూడు డైమండ్ నెక్లెస్ లు, 86.550 గ్రాముల డైమండ్, బంగారు గాజులు, 161 గ్రాముల బంగారు నెక్లెస్ కలిపి 736 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు ఓ మహిళకు షార్ట్ ఫిలింలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. నిందితునిపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఎస్ఓటి డీసీపీ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితున్ని పట్టుకున్నారు.

You cannot copy content of this page