పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకొవటం కంటే దానిని నిలుపుకోవటమే చాలా కష్టం. ఏ మాత్రం తేడా జరిగినా ఉన్న ఇమేజ్ కూడా ఊడిపోయో ప్రమాదం ఉంది.
అందుకే దాని కోసం మన హీరోలు మాస్టర్ ప్లాన్ ఒకటి కనుక్కున్నారు. ఒకరి వెంట ఒకరు ఆ ప్లాన్ను ఫాలో అవుతున్నారు. మరి అంతగా ఆకట్టుకుంటున్న ఆ ప్లాన్ ఏంటీ, అది ఫాలో అవుతున్న ఆ హీరోలు ఎవరు. పాన్ ఇండియా స్టార్స్ తప్ప రీజినల్ స్టార్ హీరోలు ఎవ్వరూ లేరు ఇప్పుడు. ముఖ్యంగా హీరోలందరి ఫోకస్ పాన్ ఇండియా పై షిఫ్ట్ అయ్యాక లోకల్ మార్కెట్ చిన్నది ఐపోయింది. తెలుగు దర్శకుడు రాజమౌళి పుణ్యమా అని ప్రభాస్, జూ. ఎన్టీఆర్ ,
రాంచరణ్ పాన్ ఇండియా స్టార్స్ ఐపోయారు. సుకుమార్ అండతో అల్లు అర్జున్ ఉత్తరాదిన సత్తా చూపించారు. వీళ్లంతా ఇప్పుడు వచ్చిన మార్కెట్ ను కాపాడుకోవడానికి కొత్త ప్లాన్ను సిద్ధం చేశారు. పాన్ ఇండియా మార్కెట్ వచ్చిన తరువాత, ఒకే భాష లోనే దర్శకులు ఫిక్స్ ఐపోతే మంచిది కాదని ఆలోచనలో ఉన్నారు మన హీరోలు. అందుకే అన్నీ ఇండస్ట్రీ దర్శకులతో పని చేయటానికి ఆసక్తి చుపిస్తున్నారు.
ఉదాహరణకు ప్రభాస్ ని తీసుకోండి సలార్ తెరకెక్కిస్తున్న ప్రశాంత్ కన్నడ ఇండస్ట్రీ దర్శకుడు. అలాగే సిధార్ద్ ఆనంద్, ఓమ్ రౌత్ హింది వాళ్ళు. జూ. ఎన్టీఆర్ ప్లాన్ కుడా ఇలానే ఉంది. ఈయన ఫోకస్ అంతా సౌత్ దర్శకుల పైనే ఉంది. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్నారు. తరువాత ప్రశాంత్ ను లైన్లో పెట్టారూ.
అలాగే హాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కు అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్ ఏం తక్కువ తినలేదు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న చరణ్, ఆ తరువాత బుచ్చిబాబు తో భారీ సినిమాకి కమిట్ అయ్యారు .ఈ గ్యాప్ లో లో కన్నడ ఇండస్ట్రీ నుంచి ప్రశాంత్ శిష్యుడు నార్తన్ కు ఛాన్స్ ఇచ్చారు. అలాగే లోకేష్ కనకరాజ్ సైతం కథ సిద్ధం చెస్తున్నారు. మొత్తానికి ఇలా తెలుగు,తమిల్,కన్నడ, హింది దర్శకులకు ఛాన్స్ ఇస్తూ అసలైన పాన్ ఇండియా ప్లాన్ అప్లై చేస్తున్నారు మన హీరోలు.