దిశ దశ, హైదరాబాద్:
పద్మ అవార్డుల ఎంపికలో తెలుగు రాష్ట్రాలలో అరుదైన చరిత్ర క్రియేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డులకు ఎంపికైన చరిత్రను సృష్టించాయి తెలుగు రాష్ట్రాలు. అత్యంత అరుదైన చరిత్రలో ఒకటిగా నిలిచిన ఈ రికార్డు ఇండియాలోనే హైలెట్ గా అవుతోంది.
ఒకే గ్రామం నుండి ఇద్దరు…
తెలంగాణాలోని ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు పద్మ పురస్కారాలు అందుకున్నారు. యాదాద్రి జిల్లా బొల్లేపల్లికి చెందిన కమ్యూనిస్ట్ యోధుడు రావి నారాయణరెడ్డికి గతంలో పద్మ విభూషణ్ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో బొల్లెపల్లికి ఒకప్పుడు అనుభంద గ్రామంగా ఉన్న ఆకుతోటబావి తండాకు చెందిన కేతావత్ సోమ్ లాల్ ను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ఒకే ఊరు నుండి ఇద్దరు పద్మ అవార్డులకు ఎంపికైన చరిత్ర ఈ గ్రామానికి మాత్రమే దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక గ్రామంగా బొల్లేపల్లి రికార్డును అందుకోగా దేశంలో కూడా అరుదైన గ్రామాల సరసన చేరింది. నాస్తిక వాదంతో దేవుడిని విశ్వసించని రావి నారాయణ రెడ్డి, ఆస్తికత్వాన్ని విశ్వసించి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా లిపిలోకి తర్జుమా చేసిన కేతావత్ సోమ్ లాల్ లు పద్మాలు అందుకోవడం మాత్రం వైవిద్యతను సంతరించుకుంది.
పద్మ విభూషణులుగా…
ఇకపోతే సిని నటుడు రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా మరో అరుదైన చరిత్రను సొంతం చేసుకుంది. ఆయన సతీమణి ఉపాసన తాత అపోలో గ్రూప్స్ వ్యవస్థపాకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గతంలో పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. తాజాగా రామ్ చరణ్ తండ్రి, టాలివుట్ టాప్ హీరో చిరంజివిని కేంద్రం పద్మ విభూషన్ కు ఎంపిక చేసింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నట్టయింది.