పాముకు వినతి ప్రతం ఇచ్చిన పంచాయితీ కార్మికులు

దిశ దశ, జగిత్యాల:

సర్కారుపై నిరసన వ్యక్తం చేయాలంటే వినతి పత్రాలను విగ్రహాలకో, జంతువులకో ఇస్తు తమ బాధను వెల్లగక్కడం కామన్. డిమాండ్లను సాధించుకునేందుకు వింత వింతగా ఇలాంటి ఆందోళనలు నిర్వహిస్తుంటారు. కానీ అక్కడ మాత్రం ఏకంగా నాగు పాముకు వినతి పత్రం ఇచ్చి సంచలన సృష్టించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని 23 రోజులుగా సమ్మెబాటలో ఉన్న పంచాయితీ కార్మికులు పాముకు వినతి పత్రం ఇచ్చారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న పంచాయితీ కార్మికులు తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తు ఏకంగా నాగు పాముకు వినతి పత్రం ఇచ్చారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు తమ ఇతరాత్ర డిమాండ్ల గురించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభ్యర్థిస్తున్నారు. జేఏసీ నాయకులకు ప్రభుత్వ పరంగా మాట ఇచ్చి తమను ఆదుకోవాలని పంచాయితీ కార్మికులు కోరుతున్నారు. ఏది ఏమైనా పంచాయితీ కార్మికుల పాముకు వినతి పత్రం ఇవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page