పేపర్లు కాల్చి… హార్డ్ డిస్కులు మార్చి…

మొబైల్ రిట్రైవ్ చేస్తున్న నిపుణులు

ఫోన్ ట్యాపింగ్ కేసు…

దిశ దశ, హైదరాబాద్:

డిసెంబర్ 4న ఎస్ఐబీ కార్యాలయంలో ఏం జరిగింది..? సపరేట్ గా ఏర్పాటు చేసిన ఆ రెండు గదుల్లో ఎవరెవరు ఉన్నారు..? డీఎస్పీ ప్రణిత్ రావు ఏం చేశారు..? ఈ అంశంపై పూర్తి క్లారిటీ కోసం పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక దృష్టి సారించిన దర్యాప్తు బృందం వివిధ రకాలుగా లోగుట్టు రాబట్టే పనిలో నిమగ్నం అయింది.

పై అధికారుల ఆదేశాలే…

రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోగానే ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఆఫీసులో ఉన్న రికార్డులను మార్చేయాలన్న ఆదేశాలు తన పై అధికారుల నుండి రావడం వల్లే ప్రణిత్ రావు సాహసం చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. తనతో కలిసి పనిచేసిన వారిలో విశ్వసీనీయత ప్రదర్శించిన వారి సహకారంతోనే రికార్డులను గల్లంతు చేసినట్టుగా భావిస్తున్నారు. అయితే మొదట అనుమానించినట్టుగా హార్డ్ డిస్కులను ధ్వంసం చేయకుండా సుమారు 10 వేల పేజీలను జనరేటర్ సమీపంలో కాల్చివేసినట్టుగా గుర్తించారు. అందులో వివిధ వర్గాలకు చెందిన వారి ట్యాపింగ్ తో పాటు సీడీఆర్ వివరాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే హార్డ్ డిస్కుల్లోని డాటాను క్లియర్ చేయకుండా వాటిని మార్చివేసినట్టుగా తేలినట్టుగా సమాచారం. 42 సిస్టమ్స్ కు కొత్తవి బిగించి పాతవాటిని ఓ కార్టన్ లో ప్యాక్ చేసుకుని తీసుకెళ్లినట్టుగా దర్యాప్తు బృందం తేల్చింది. అయితే ఈ హార్డ్ డిస్కులు ఎక్కడికి తరలించాడు..అందులో ఏమేం వివరాలు ఉన్నాయి అన్న వివరాలపై క్లారిటీ రావడం లేదు. కానీ ఎస్ఐబీ కార్యాలయంలో ఉండాల్సిన పొలిటికల్ వింగ్ సమాచారంతో పాటు నక్సల్స్ కార్యకలాపాలకు సంబంధించిన డిటైల్స్ మిస్ అయ్యాయని గుర్తించినట్టు సమాచారం. అయితే వీటన్నింటిని ఎక్కడ దాచిపెట్టాడన్న విషయంతో పాటు ఇతరాత్రా సీక్రెట్ ఫైల్స్ ఆచూకి తెలియాల్సి ఉన్నందున ఆయన్ని వారం రోజుల పాటు కస్టడికీ ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించినట్టు సమాచారం. మరో వైపున ఇంటలీజెన్స్ లో మెయిన్ రోల్ పోషించిన అధికారుల వివరాలు, ఈ డాటాను అడ్డుపెట్టుకుని ఏమేం చేశారు అన్న వివరాలు కూడా సేకరించాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది.

2014లో…

మరో వైపున ఇంటలీజెన్స్ విభాగం పర్యవేక్షించే పొలిటికల్ వింగ్ ను ఉన్నట్టుండి ఎస్ఐబీ కార్యాలయంలోకి మార్చడం వెనక కారణాలు ఏంటన్న అనుమానలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 2014 వరకు కౌంటర్ ఇంటలీజెన్స్ సెల్ తో అనుభందంగా ఉన్న ఈ విభాగాన్ని కేవలం నక్సల్స్ ఆపరేషన్లపై నిఘా వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటలీజెన్స్ విభాగానికి అటాచ్ చేశారందుకన్నదే అంతుచిక్కకుండా పోతోంది. రాజకీయ నాయకుల వ్వవహారాలను పర్యవేక్షించాల్సిన ఈ వింగ్ ను సీక్రసీ మెయింటెన్ చేయాల్సిన ఎస్ఐబీ కార్యాలయానికి మార్చారంటే పకడ్భందీ స్కెచ్ వేసి ఉంటారన్న అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఐబీ ఆపీసులో అయితే బహిర్గతం కాదన్న లక్ష్యంతోనే అక్కడకు మార్చి ఉంటారని భావిస్తున్నారు. నక్సల్స్, దాని అనుభంద సంఘాల కార్యకలాపాలపై మాత్రమే పర్యవేక్షణ చేయాల్సిన ఎస్ఐబీ కార్యాలయానికి మార్చి పొలిటికల్ వింగ్ నాయకుల అంతర్గత విషయాలు తెలుసుకునేందుకు పథకం పన్ని ఉంటారని అనుకుంటున్నారు.

రిటైర్డ్ అధికారికి బాధ్యతలు ఎలా..?

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించేది ఇంటలీజెన్స్ వ్యవస్థే. ఈ విభాగం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు అసాంఘీక శక్తులపై ఆరా తీసి ఎప్పడికప్పుడు నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తుంటుంది. అత్యంత రహస్యంగా సాగే ఈ విభాగం కార్యకలాపాలు చాలా వరకు కూడా బాధ్యతలు అప్పగించిన వారికి, ఇందుకు సంబంధించిన అధికారికి మాత్రమే తెలిసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన ఈ ఇంటలీజెన్స వింగ్ బాధ్యతలు కూడా విశ్వసనీయతను కనబర్చే అధికారులకు మాత్రమే బాధ్యతలు అప్పగిస్తుంటారు. అయితే ఈ విబాగంలో రిటైర్డ్ అయిన అధికారికి బాధ్యతలు అప్పగించడం వెనక అసలే జరిగింది అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. రిటైర్మెంట్ కానీ వారయితే క్రమశిక్షణా చర్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్న భయంతో బాధ్యతగా మెదులుతారు కానీ రిటైర్డ్ అయిన వారికి అప్పగిస్తే సీక్రసీకి తావు లేకుండా పోయే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారన్న చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులకు అత్యంత సన్నిహితులే అయినా ఇలాంటి కీలక విభాగంలో అత్యంత రహస్యమైన సమాచారం సేకరించే విభాగంలో కొనసాగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. రిటైర్డ్ అధికారులకు అండగా నిలవాలనుకుంటే ఇతర విభాగాల్లో కొనసాగించడం సముచితం కానీ నిఘా విభాగంలో పోస్టింగ్ ఇవ్వడం మాత్రం అత్యంత ప్రమాదకరమైని పోలీసు వర్గాలు అంటున్నాయి. వీరికి దొరికిన స్వేచ్ఛ కారణంగానే కుటుంబాల మధ్య జరిగిన విషయాలను కూడా ట్యాపింగ్ చేశారని, అంతేకాకుండా రియాల్టర్లను, బడా వ్యాపారులను కూడా ఈ జాబితాలో చేర్చి ఇష్టారీతిన వ్యవహరించారన్న విమర్శలు కూడా మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో ఇంకా సర్వీసు ఉన్న ప్రణిత్ రావుతో పాటు ఇతర అధికార యంత్రాంగం బాధ్యత వహించే అవకాశం ఉంటుంది కానీ రిటైర్ అయిన వారికి జవాబుదారి తనం ఉండదన్న విషయాన్ని విస్మరిచడం వెనక దాగి ఉన్న వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

You cannot copy content of this page