పేరెంట్స్ మర్డర్ స్కెచ్…

సుపారీ ఇచ్చి మరీ హత్య

మాతృత్వపు మాధుర్యాన్ని… రక్తం పంచి కని పెంచిన తండ్రి మానవత్వానికే పరీక్ష పెట్టాడో తనయుడు. కడుపున పుట్టిన బిడ్డ వ్యవహరిస్తున్న తీరుతో విసిగి వేసారి పోయిన ఆ తల్లిదండ్రులు చివరకు అతన్ని చంపించేంత కఠినాత్ములుగా మారిపోయారు. చెట్టంత ఎదిగిన కొడుకును చూసి మురిసిపోవల్సిన పేరెంట్స్ అతనిపై ఉన్న ప్రేమను చంపేసుకుని… ఆ తరువాత అతన్ని హతమార్చేందుకు సుపారీ ఇచ్చారంటే వారు ఎంత మనో వేధనకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో స్థిరపడిన బిడ్డను గుర్తుకు తెచ్చుకుంటూ సంబరపడాలో వికృతంగా తయారైన కొడుకును చూసి వెక్కివెక్కి ఎడ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో చివరకు నవమాసాలు పెంచి జన్మనిచ్చిన తల్లి… బుడి బుడి అడుగులు నేర్పిన తండ్రి కిరాతకంగా ఆలోచించారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గురువే తన తనయుడిని మట్టబెట్టేందుకు స్కెచ్ వేశాడు… ఇంతకీ ఈ మర్డర్ కు కారణం ఏంటీ..? సూపారి ఇచ్చేంత దుస్సాహాసం ఎందుకు చేశారో తెలుసా….?

ఏం జరిగిందంటే….

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కేంద్రానికి చెందిన క్షత్రియ రామ్ సింగ్, రాణీ బాయిలు కొంతకాలంగా ఖమ్మం పట్టణంలో నివాసముంటున్నారు. సత్తుపల్లిలోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా రామ్ సింగ్ పనిచేస్తు జీవనం సాగిస్తున్న వీరికి కూతురు, కుమారుడు సాయినాథ్ ఉన్నారు. వివాహం కావడంతో కూతురు భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడగా… కొడుకు సాయినాథ్ తల్లిదండ్రులతోనే ఖమ్మంలో ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా క్రమ శిక్షణ తప్పిన సాయినాథ్ తల్లిదండ్రులకు భారంగా మారిపోయాడు. తల్లిదండ్రులకు బాసటగా నిలవాల్సిన వయసులో వారినే ముప్పుతిప్పలు పెడుతూ.. ఇబ్బడిముబ్బడిగా ఖర్చులు పెడుతూ పేరెంట్స్ కు కంటిమీద కునుకు లేకుండా నడుచుకుంటున్నాడు. కారు కొనడం.. 6 నెలల్లో అమ్మేయడం… స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం ఇవే సాయినాథ్ కు దినచర్యగా మారిపోయింది. తన జల్సాలకు అవసరమైన డబ్బు కోసం తల్లిదండ్రులు ముప్పు తిప్పలు పెడుతూ.. కనిపెంచిన వారిపైనే దాడులకు దిగేవాడు. రోజు రోజుకు సాయినాథ్ వ్యవహారం మితిమీరి పోవడంతో చివరకు అతనిలో మానసిక పరివర్తన తీసుకొచ్చేందుకు కూడా తల్లిదండ్రులు ప్రయత్నించారు. మద్యానికి బానిసగా మారిన అతన్ని హైదరాబాదులోని రిహాబిటేషన్ సెంటర్‌లో 6 నెలలు ఉంచారు. అయినప్పటికీ సాయినాథ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడం… గతంలోలాగానే జల్సాల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతూ తమను ముప్పు తిప్పలు పెడతున్న తనయుడిని వదిలించుకోవడమే ఏకైక మార్గమని భావించారు రామ్ సింగ్, రాణీ బాయిలు.

సూపారి మర్డర్…

సాయినాధ్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్న పేరెంట్స్ రూ. 8 లక్షల సుఫారి ఇచ్చేందుకు మర్డర్ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మిర్యాలగూడలో ఉంటున్న ఆటో డ్రైవర్ రవి నాయక్‌తో ఈ మేరకు బేరసారాలు కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ. 1.50 లక్షలు కూడా ఇచ్చారు. రవి నాయక్ గ్యాంగ్ సాయినాథ్ ను హత్య చేసేందుకు ఖమ్మం పట్టణంలో అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వెనుదిరిగారను. అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు ఉండడం, అక్కడ వీఐపీలు కూడా నివాసం ఉంటున్నట్లు గమనించి సాయినాథ్ ను మర్డర్ చేయడం అక్కడ అంత సులువు కాదని నిర్దారించుకున్నారు. ప్లాన్ ఏ కు వేసుకున్న స్కెచ్ సక్సెస్ కాదని భావించి ప్లాన్ బి తయారు చేసుకున్నారు. సాయినాథ్ అమ్మమ్మ వాళ్లు ఉండే మిర్యాలగూడ కేంద్రంగా హత్య చేయాలని ప్లాన్ చేసి అతని మేనమామ సత్యనారాయణ సహకారంతో మరో స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి మైసమ్మ వద్ద మెుక్కు ఉందని సాయినాద్‌ను తీసుకెళ్లి కోడి కోసి దావత్ ఏర్పాటు చేసిన క్రమంలో సాయినాథ్ ను సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లిన రవి నాయక్ గ్యాంగ్ ప్లాస్టిక్ తాడుతో అతని గొంతుకు ఉరివేసి హత్య చేశారు. ఆ తరువాత సాయినాథ్ మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహడ్ సమీపంలోని మూసీ నదిలో పడేసి వెళ్లిపోయారు.

లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు…

మూసీ నదిలో లభ్యమైన గుర్తు తెలియని యువకుడిని హత్య చేసి అగంతకులు పరార్ అయ్యారని ప్రాథమికంగా నిర్దారించిన సూర్యపేట జిల్లా పోలీసులు హంతకుల ఆచూకి కోసం ఆరా తీయడం ఆరంభించారు. శవం లభ్యమైన ప్రాంతంలో ఏమైనా ఆధారాలు లభ్యం అవుతాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరో వైపున సాంకేతికతను కూడా అందిపుచ్చుకుని దర్యాప్తును లోతుగా చేపట్టడం ఆరంభించారు. శవం లభ్యమైన ఏరియా టవర్ లోకెషన్ లో వీనియోగించిన మొబైల్ ఫోన్ల డాటా సేకరించిన పోలీసు అధికారులు అనుమానిత నెంబర్లను గుర్తించి వాటి ఆధారంగా విచారించడం ఆరంభించారు. సస్పెక్టెడ్ నెంబర్ల కాల్ డేటా ఆధారంగా వివరాలను సేకరిస్తున్న పోలీసులు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు చేసిన కాల్స్ లో మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తికి కూడా వెల్లడంతో అతను భయపడి తనకు తెలిసిన విషయాన్ని వారికి వివరించాడు. ఈ ఒక్క క్లూను ఆధారం చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి వారిని పట్టుకున్నారు. ఈ సుపారీ మర్డర్ లో రవి నాయక్ గ్యాంగ్ కు చెందిన ఐదుగురితో పాటు సాయినాథ్ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పాలకవీడు పోలీసులు. ఈ కేసులో హతుని తల్లిదండ్రులు క్షత్రియ రామ్ సింగ్, క్షత్రియ రాణిబాయి, మేనమామ సహదేవుల సత్యనారాయణ సింగ్, సూపారి గ్యాంగ్ రమావత్ రవి నాయక్, పాగుగోతు నాగరాజు, బురుగు రాంబాబు, దానవత్ సాయి, దీరావత్ దర్మలను అరెస్ట్ చేసిన పోలీసులు హుజూర్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల నుండి 4 కార్లు, మోటార్ సైకిల్, ప్లాస్టిక్ తాడు మెబైల్ పోన్లు, సుపారీ నగదు రూ. 23,500 స్వాధీనం చేసుకున్నారు.

You cannot copy content of this page