దిశ దశ, పెద్దపల్లి:
దండిగా వర్షాలు పడాల్సిన సమయంలో పిడుగుల వర్షం ఇంకా ప్రకృతిని వెంటాడుతూనే ఉంది. సమృద్దిగా వర్షాలు పడితే వ్యవసాయం పనులు చకాచకా చేసుకోవచ్చని రైతులు భావిస్తుంటే పిడుగులు జనాలను భయం గుప్పిట చేర్చుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ గోపురం పాక్షికంగా దెబ్బతిన్నది. దీంతో గ్రామస్థులంతా భయపడిపోయారు.
