దిశ దశ, జాతీయం:
పాస్ పోర్టు కోసం దరఖాస్తు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక సమాచారం. కొన్ని సాంకేతిక కారణల దృష్ట్యా దాదాపు మూడు రోజుల పాటు సేవలు అందుబాటులో ఉండవని పాస్ పోర్ట్ సేవా సమితి పేర్కొంది. ఈ నెల 29వ తేది రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2వ తేది ఉదయం వరకు దేశంలోని పాస్ పోర్టు కార్యాలయాల్లో సేవలు అందిచడం లేదని వివరించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. ఆయా తేదీలలో అపాయింట్ మెంట్ ఇచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. వారికి ఇతర తేదీలలో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయనున్నామని వెల్లడించింది. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్టు అపాయింట్ మెంట్ డేట్ అలాట్ అయిన వారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది. వారికి రీషెడ్యూల్ సమాచారం కూడా పాస్ పోర్టు కార్యాలయం నుండి సమాచారం ఇవ్వనుంది.
https://x.com/airnews_hyd/status/1828737861870383380?t=UWqg53rlO1yVrBMXojNCKA&s=08