దిశ దశ, సినిమా:
ఎట్టకేలకు సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఒక పవిత్ర బంధం, రెండు మనుసులు, మూడు ముళ్లు, ఏడడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ పెళ్లి వీడియోను నరేష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్రా లోకేశ్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఇద్దరూ కలిసి ఉండగా.. నరేశ్ మాజీ భార్య రమ్య రఘుపతి వారిని పట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. కాగా, ఆ వార్తలపై పవిత్ర స్పందించి తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. లివింగ్ రిలేషన్‌లో ఉన్నామని తెలిపింది. అంతేకాకుండా వీళ్ల బంధానికి కృష్ణ ఫ్యామిలీ నుంచి ఆమోదం ఉన్నట్లు కూడా తెలిపింది. అయితే అప్పటికి నరేష్‌కి మూడో భార్యతో విడాకులు కాలేదు. అందువలనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది.
కాగా, న్యూ ఇయర్ రోజున నరేష్.. తాను పవిత్ర లోకేష్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా.. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలిపాడు. దీనికి మీ ఆశీస్సులు కావాలంటూ ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో నరేష్, పవిత్ర లిప్ లాక్ పెట్టుకోవడం. లేటు వయసులో వీళ్ళ రొమాన్స్ చూసి ఇండస్ట్రీ వారితో పాటు నెటిజన్లు కూడా బిత్తరపోయారు. మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ జంట కోరింది.
తాజాగా పవిత్ర, నరేశ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్ర నరేశ్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే వీవీరింకా వివాహం చేసుకోలేదు.. అది వారు నటించిన ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జరిగిందని నెటిజన్లు అంటున్నారు.