కనీసం ఇదైనా వేసుకోనిస్తారా..?

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రశ్న లేవనెత్తారు. వైసీపీని ఉద్దేశించి చేసిన ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అలీవ్ గ్రీన్ షర్ట్ ఫోటోను పోస్ట్ చేసిన పవన్ కనీసం ఇదైనా వేసుకునేందుకు వైసీపీ అనుతిస్తుందా అంటూ ప్రశ్నించారు.



వారాహీ కలర్…

అయితే రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల కోసం తన ప్రచార రథం సిద్దమైందని దాని పేరు వారాహీగా నామకరణం చేశానని ట్విట్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది ఈ అంశం. అంతలోరే అలీవ్ గ్రీన్ కలర్ లో ఉన్న వాహనాలను రిజిస్ట్రేషన్ శాఖ అనుమతించదని ఆ రంగు ఆర్మీ వారు మాత్రమే వినియోగించాలని నిభందనలు చెప్తున్నాయని ప్రచారం చేశారు. ఏపీ మోటారు వెహికిల్ డిపార్ట్ మెంట్ అధికారులు కూడా ఇందుకు అలీవ్ గ్రీన్ కలర్ ను ఉపయోగించేందుకు రిజిస్ట్రేషన్ నిభందనలు అనుకూలించవని తేల్చిచెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా వైసీపీని లక్ష్యం చేసుకుని పోస్ట్ చేశారు.

ఊపిరి కూడా తీసుకోవడం మానేయాలా..?

మొదట నా మూవీలను నిలిపేశారు, విశాఖపట్నం హోటల్ నుండి నా వాహనం బయటకు రాకుండా అడ్డుకుని నేను విశాఖ నగరం దాటి వెల్లకుండా నిలువరించారు, మంగళగిరిలో నా కారును నన్ను మందుకు సాగనివ్వలేదు. ఇప్పుడు నా వాహానం రంగును సమస్యగా తయారు చేస్తున్నారు. నేను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా..? ఇంకా ఆ తరువాత…. అంటూ పవన్ ప్రశ్నలను సంధించారు. వైసీపీని లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. నెటిజన్లు కూడా ఇందుకు తగ్గట్టుగానే స్పందిస్తున్నప్పటికీ ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లలో పవన్ కళ్యాణ్ చేసిన పోస్టు ఇప్పుడు హాట్ టాపికగా మారింది.

You cannot copy content of this page