దిశదశ, హుజురాబాద్:
హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. లోకసభ ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్ కు పంపారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2021 ఉప ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్దిరెడ్డి… గులాభి జెండాకు బైబై చెప్పేశారు. టీడీపీలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పార్టీలో చేరారు. తిరిగి టీడీపీలో కొనసాగిన పెద్దిరెడ్డి ప్రజారాజ్యం పార్టీలో కూడా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన పెద్దిరెడ్డి తాజాగా రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పెద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
- AP
- Business News
- Crime News
- Devotional
- Education
- Entertainment News
- Flash News
- Health
- Latest News
- National
- Politics
- Sports
- Stories
- Telangana
- World
- వార్తలు
- వైరల్
- సినిమా
- స్పోర్ట్స్
