రంగంలోకి దిగిన గుజరాత్ ఏటీఎస్ బృందాలు
దిశ దశ, గోదావరిఖని:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉగ్ర కదలికల పేరిట గుజరాత్ ఏటీస్ బృందాలు గాలింపు కలకలం సృష్టించింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖని పట్టణంలో షెల్టర్ తీసుకుని ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ ఆంటీ టెర్రర్ స్క్వాడ్ టీమ్స్ ఆరా తీయడం సంచలనంగా మారింది. మంగళవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నాలుగు రోజులుగా షెల్టర్ తీసుకుని ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ ఏటీఎస్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా తండ్రి కూతుళ్లిద్దరు కూడా హైదరాబాద్ మహానగరంలోని గోల్కొండ ఏరియాలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నారని వీరికి టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం అందుకుని ఏటీఎస్ బృందాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం వీరిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ బృందం స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరిని కూడా హైదరాబాద్ లోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నామని సమాచారం ఇవ్వగా వారి వెంట సీఐ స్థాయి అధికారిని పంపించారు. మహమ్మద్ జావిద్ (46), సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా వ్యవవహరిస్తుండగా ఆయన కూతురు ఖదీజా(20)ను కూడా ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ తండ్రి కూతుర్లు ఏ టెర్రర్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు, వీరి ప్రమేయం ఎంత మేర ఉంది అన్న విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వనట్టుగా తెలుస్తోంది. సాంకేతికంగా టెర్రర్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్ర సహాకారం అందిస్తున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. అనుమానితులగా మాత్రమే తాము తీసుకెల్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకి దొరకబట్టుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు రావడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా మరో సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post