బీఆర్ఎస్ సుప్రిమ్ చెప్పారు

ఎనిమిదేళ్ల క్రితం నుండే వ్యూహం

ఏడేళ్ల క్రితం టీమ్ తయారీ…

రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం జ్యడిషియల్ రిమాండ్ లో ఉన్న రాధాకిషన్ రావును కోర్టులో హాజరు పరిచే క్రమంలో పోలీసులు ఆయన నుండి రాబట్టిన వివరాలతో కూడిన రిమాడ్ సీడి, కన్ఫెషన్ రిపోర్టులను సమర్పించారు. ఈ రిపోర్టులను పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధా కిషన్ రావు చెప్పిన ఆయా అంశాల్లో అత్యంత ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రిమ్ చెప్పినట్టుగా చేశామని తేల్చి చెప్పడం సంచలనంగా మారింది. దీంతో రాధాకిషన్ రావు కన్షెషన్ రిపోర్టులో వెలుగు చూసిన ఈ అంశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఎనిమిదేళ్ల క్రితం…

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో కులాల సమీకరణాల్లో భాగంగా ఇంటలీజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావును నియమించారు. తమ సామాజిక వర్గానికి చెందిన నమ్మకమైన సబార్డినేట్ అధికారులను నియమించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభాకర్ రావుకు విశ్వాసంగా ఉన్న వారిని ఈ విభాగంలో పోస్టింగ్ వేయించుకున్నారు. ఇందులో భాగంగా తనకు అనుకూలంగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన ప్రణిత్ రావు, రాచకొండలో పనిచేస్తున్న భుజంగరావు, సైబరాబాద్ లో పనిచేస్తున్న వేణుగోపాల్ రావు, హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న తిరుపతన్నలను నియమించుకోవాలని ప్రభాకర్ రావు రికమండ్ చేశారు. రాధా కిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీసీగా పోస్టింగ్ వేయించుకున్నారన్నారు. టీఆర్ఎస్ సుప్రిమ్ రాజకీయాలతో పాటు ఇతర అంశాల్లోనూ హైదరాబాద్ సిటీలో మెయింటెన్ చేయాలన్నారు. ఇంటలీజెన్స్ లో ఉన్న ప్రభాకర్ రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు, ప్రణిత్ రావు తాను తరుచూ కలుస్తూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎలా ముందుకు సాగాలి అన్న విషయాలపై చర్చించేవారు. ప్రభాకర్ రావు సిఫార్సు మేరకు టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ లో లో గట్టుమల్లు పోస్టింగ్ వేయించగా ఆయన రెండేళ్ల పాటు అంటే 2021 వరకు పనిచేశారని ఆ తరువాత ఎస్ఐబీకి బదిలీ చేశారన్నారు. అ తరువాత సోషల్ మీడియా యాప్స్ వాట్సప్, సిగ్నల్, స్నాప్ ఛాట్ ద్వారా షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఎస్ఐబీలో ఏర్పాటు చేసుకున్న ఎస్ఓటీ వింగ్ కు ప్రణిత్ రావును ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ టీమ్ పొలిటికల్ లీడర్స్ తో పాటు వారి అనుచరులపై నిఘా వేసేందుకు మాత్రమే ఏర్పాటయింది. సొంత పార్టీలో నెలకొన్న అసమ్మతిని గుర్తించడం, ఇతర పార్టీల వారిని చేరదీసి బీఆర్ఎస్ పార్టీలో చేర్పించే విధంగా చొరవ తీసుకోవడం చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో మూడో సారి బీఆర్ఎస్ పార్లీ అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఈ టీమ్ అంతా కలిసి పనిచేసింది.

8 సార్లు డబ్బు తరలింపు…

రిటైర్డ్ అయిన తరువాత టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించిన రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకరాం ఎనిమిది సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించారు. 2018తో పాటు దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబ్బులు రవాణా చేశారు. టాస్క్ ఫోర్స్ టీమ్ కోసం ప్రత్యేకంగా వాహనాలను మాజీ ఐపీఎస్ అధికారి సమకూర్చాడు. టాస్క్ ఫోర్స్ టీమ్ ను బెదిరింపులకు గురి చేసి కూడా నగదు రవాణా చేయించారు రాధా కిషన్ రావు. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన చిన్నేనాటి స్నేహితుడు అయినందున ఆయనకు కూడా నగదు రవాణా చేశాడు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నగదును పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ యంత్రాంగం కీలక పాత్ర పోషించింది. ఎనిమిది సార్లు టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకున్న నగదు అంతా కూడా ప్రతిపక్ష పార్టీలదేనని తేల్చారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకుని ముందుకు సాగామని, ఇతర పార్టీల నేతల ఆర్థిక లావాదేవీలే ఆరా తీయడమే పనిగా ఫెట్టుకున్నారు.

You cannot copy content of this page