పంచాయితీ పరిధిలో సమస్యలు పరిష్కరించాల్సిన ఆ సర్పంచ్ పంతులుగా మారిపోయాడు. పారిశుద్ధ్య కార్మికులను పనికి పురమాయించాల్సిన ఆయన పలకా బలపం పట్టుకున్న పిల్లలకు చదువులు చెప్పారు. బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు అంగన్ వాడీ సెంటర్ లో బడిబాట కార్య్రకమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ సత్యనారాయణరెడ్డి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసమే కాకుండా స్నేహ భావాన్ని పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు పాఠశాల, తల్లిదండ్రుల గౌరవాన్ని మరింత ఇనుమడిపంజేసే విధంగా ముందుకు సాగాలన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని, సమాజంలో విలువలు అందుకునే విధంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడి చిన్నారులకు పాఠాలు చెప్పడమే కాకుండా వారితో పాటు కూర్చుని కేంద్రంలో బోధన సాగుతున్న తీరును కూడా పరిశీలించారు. ఈ కార్య్రక్రమంలో ఎంపీటీసీ కొమిరె మల్లేశంగౌడ్, ఉప సర్పంచ్ బామండ్ల తిరుమల తదితరులు పాల్గొన్నారు.