భారత ప్రధాన మంత్రి విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే వారం వెల్లనున్న ప్రధాని జీ20 సదస్సుకు హాజరు కానున్నారని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు తెలిపారు. ఈ నెల 14 నుండి 16 తేదీల్లో ఇండోనేషియా రాజధాని బాలీలో పర్యటించనున్నారు. జీ20 సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. ఈ సదస్సుతో పాటు యూఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మన్ దేశాధినేతాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంతో ఆహార, శక్తి, భద్రత పరమైన సమస్యలతో పాటు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న వాతవరణ మార్పులతో పాటు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు ఆయన జీ20 సదస్సుకు ప్రధాని హజరవుతున్నారు.