ఆత్మీయ సమ్మేళనంలో అన్నం కోసం గలాట

విరిగిన కుర్చీలు… ఎంటర్ అయిన పోలీసులు

దిశ దశ, వరంగల్:

బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆత్మీయతను ప్రదర్శించుకోవాలని అధిష్టానం చెప్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం గలాటా సృష్టిస్తున్నారు. ఈ గలాటా కూడా వర్గపోరులో భాగంగా ఆధిపత్యం చెలాయించేందుకు మాత్రం కాదు… అక్కడ ఏర్పడ్డ ఈ గందరగోళంతో పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ గలటా… ఏమైంది అనుకుంటున్నారా..? అయితే మీరీ కథనం చదవండి.

లాక్కెల్లిన వంట పాత్రలను భోజనాల వద్దకు తీసుకెల్తున్న స్టాఫ్

సీరోల్ మండల కేంద్రంలో…

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మండలంలోని వివిధ ప్రాంతాల నుండి పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. అయితే సమావేశానికి రావాలని పిల్చిన తమకు భోజనం పెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు యువకులు. వెంటనే వంటలు సిద్దం చేసిన చోటకు చేరుకున్న వారంతా ఏకంగా భోజనాల పాత్రలను ఎత్తుకెళ్లారు. వారి వెంట అక్కడ సేవలందిస్తున్న వారు పరిగెత్తి మరీ వెనక్కు తీసుకొచ్చారు. అయినా వినకుండా వంటకాల పాత్రల వద్దకు వచ్చి ఎవరికి వారు వడ్డన చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో అవి విరిగిపోయాయి. ఓ టెంట్ కూడా కిందపడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని యువకులను అక్కడి నుండి పంపించేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

విరిగిపోయిన కుర్చీ

You cannot copy content of this page