దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లాఠీ ఛార్జి ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం అర్బన్ బ్యాంకు ముందు స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల కౌంటింగ్ కు ప్రక్రియ కొనసాగింది. గెలిచిన డైరక్టర్లు క్యాంపులకు తరలిస్తున్న క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అర్బన్ బ్యాంక్ ముందు ఉన్న వివిధ పార్టీల నాయకులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారంతా పరుగులంకించుకున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నేత చొప్పదండి ప్రకాష్ కొడుకుకు లాఠీ దెబ్బ పడింది. దీంతో ప్రకాష్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.