ప్రజలతో మమేకం అయ్యేందుకు యత్నం
ప్రభావిత ప్రాంతాల్లో గ్రంథాలయాల ఏర్పాటు…
దిశ దశ, దండకారణ్యం
నక్సల్స్ ఉనికి గణనీయంగా తగ్గించాలంటే ప్రజలతో మమేకం కావాలి. వారితో కలిసిపోయి పోలీసులు మీ సేవకులు అన్న భావన కల్పించాలి. వారికి అత్యంత సాన్నిహిత్యంగా మెదులుతున్న అన్నలను దూరం చేయాలంటే ముందు ప్రజలతో స్నేహం భావం ప్రదర్శించాలి అనే కాన్సెప్ట్ తో తెలంగాణ పోలీసులు ముందుకు సాగారు. దీనివల్ల కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు తెలంగాణలోని ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులు. ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు కూడా ఇదే పద్దతిన ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఒకే గ్రామం ఒకే గ్రంథాలయం…
తాజాగా బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ వినూత్న కార్యక్రామన్ని ప్రారంభించారు. జిల్లాలోని ఏటపల్లి డివిజన్ గ్రంథదిడిలో ‘‘ఒకే గ్రామం ఒకే గ్రంథాలయం’’ పేరిట లైబ్రరీని స్టార్ట్ చేశారు. బాబా సాహెబ్ చిత్రపటాన్ని ఓ పల్లకిలో పెట్టి మోసుకుంటూ ఏటపల్లిలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గ్రంథాలయం ప్రారంభించారు. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాలో మా గ్రంథాలయం పేరిట గ్రామ గ్రామన లైబ్రరీలను ఏర్పాటు చేసి పల్లె ప్రజలకు జ్ఞానం అందించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా పీపుల్స్ వార్ ఎత్తులను చిత్తు చేసేందుకు నక్సల్స్ మందుపాతరలతో పేల్చేసిన భవనాలను భాగు చేయించి విధ్వంసం జరిగిన చోటే వికాసం అన్న నినాదంతో లైబ్రరీలను ఏర్పాటు చేశారు. జనశక్తికి పెట్టని కోటగా ఉన్న వీర్నపల్లిలో మొట్టమొదట గ్రంథాలయం ప్రారంభించారు. డైలీ న్యూస్ పేపర్లతో పాటు ఇతరాత్ర పుస్తకాలను ఇందులో ఉంచేవారు. ఇదే పద్దతిన ఏటపల్లి కేంద్రంలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన గడ్చిరోలి పోలీసులు మరిన్ని ఎక్కువ సౌకర్యాలను సమకూర్చారు. కేవలం పేపర్లే కాకుండా ఇతరాత్ర అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచి విజ్ఞాన భాండాగారాన్ని ఏర్పాటు చేశారు. వైఫై సౌకర్యంతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని గ్రంథాలయానికి వచ్చే వారికి సకల సౌకర్యాలు అందిస్తున్నారు. ప్రజల్లో మేథో సంపత్తిని పెంచడంతో పాటు భావి పౌరులు ఈ గ్రంథాలయానలు ఆలంచనగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేశారు. మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులు కాకుండా ప్రభావిత ప్రాంత ప్రజలు ఈ లైబ్రరీల ద్వారా రాజ్యంగ బద్దంగా నడుచుకునే పరిస్థితులు తయారు చేసే విధంగా ఇక్కడి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ, అంతర్జాతీయ సమాచారం కూడా ఇక్కడ అందించాలన్న సంకల్పంతో వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించినట్టు తెలుస్తోంది. అదనపు పోలీసు సూపరింటెండెంట్ కుమార్ చింతా, ఏటపల్లి రిటైర్డ్ ఆదర్శ ఉపాధ్యాయుడు శ్రీ. జ్ఞానేశ్వర్ కోవె, అధ్యక్షురాలు గాయత్రీ పరివార్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రంథాలయంలో ఫ్రీ వైఫైతో పాటు మీటింగ్ టేబుల్, కుర్చీలు, బుక్ షెల్ఫ్లతో పాటు ఇతరాత్రా సౌకర్యాలను కల్పించారు. గడ్చిరోలి జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ కుమార్ చింతా, అహేరి అడిషనల్ ఎస్పీ యతీష్ దేశ్ ముఖ్, ఎస్డీపీఓలు శుభమ్ గుప్తా, సుదర్శన్ రాథోడ్, 191 బెటాలియన్ ఇన్స్ పెక్టర్ షెకావత్, ఇన్‌చార్జి అధికారి విజయానంద్ పాటిల్, పూపాని కాంబ్లే, ఎంపీపీ సవితా కాలే తదితరులు పాల్గొన్నారు.