హైదరాబాద్‌‌లో వ్యాపారం చేస్తున్నారా? అయితే ఇది తప్పనిసరి

హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేస్తున్న వారికి షాకింగ్ న్యూస్. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాపారస్తులకు షాకిచ్చారు. వ్యాపారం చేయాలంటే పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీతో పాటు పోలీసుల నుండి లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

అయితే, గతంలోనూ వ్యాపారాలకు పోలీస్ లైసెన్స్ విధానం ఉంది. కానీ, 2014 తర్వాత ఈ లైసెన్స్ విధానాన్ని సిటీ పోలీసులు రద్దు చేశారు. తాజాగా వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్‌ లైసెన్స్‌ నిబంధనలను పునరుద్ధరించారు. తొమ్మిదేళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్‌ నిబంధన అమలు చేస్తున్నారు. వ్యాపారులు ఈ లైసెన్స్‌ను ఏఏ వ్యాపారం చేసేవారు తీసుకోవాలనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌, కాఫీ షాప్, టీ స్టాల్, కేఫ్‌, బేకరీ, రెస్టారెంట్, ఐస్‌క్రీమ్ పార్లర్, స్వీట్ షాప్, జ్యూస్ సెంటర్, సినిమా థియేటర్స్‌, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులు విక్రయించే వారు తప్పనిసరిగా పోలీస్ లైసెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక, ఈ పోలీస్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్‌ను పొందాలనుకునే వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి. తమ వ్యాపార స్థాయిని బట్టి రూ.1000 నుంచి రూ.15000 వరకూ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే GHMC ట్రేడ్ లైసెన్స్‌, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఏటా ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 తేదీ వరకు గడువుతో ఈ లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. పోలీస్‌ లైసెన్స్‌ తీసుకోవడానికి ఈ మార్చి 31వరకు టైమ్‌ ఇచ్చింది. ఈ లెసెన్స్ లు తీసుకోన్నట్టయితే వ్యాపారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్థి నష్ట వాటిల్లినప్పుడు ఇన్సూరెన్స్ పొందాలంటే పోలీస్ క్లియరెన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్రమంలో తమ శాఖ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసు అధికారులు ఆన్ లైన్ లో చెక్ చేసి రిజక్ట్ చేసే అకవాశం కూడా ఉంటుంది. ఎప్ఐఆర్ వంటివి జారీ చేయడానికి కూడా పోలీసు అధికారులు విముఖత చూపే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రిమీయం చెల్లించినా పరిహారం పొందే అవకాశం ఉండదు.

You cannot copy content of this page