బీహార్ లో రోడ్డున పడ్డ పోలీసు పంచాయితీ…

నిలువరించిన స్థానికులు

దిశ దశ, జాతీయ:

శాంతి భధ్రతల పరిరక్షణలో పని చేయాల్సిన పోలీసులే నడిరోడ్డుపై తన్నుకున్నారు. అ సాంఘీక శక్తులపై నాట్యం చేయాల్సిన లాఠీ వారి శరీరాలపై చేసింది. క్రమ శిక్షణకు మారు పేరుగా నిలవాల్సిన పోలీసుల తీరు చూసిన స్థానికులు వారిని వారించారు. బీహార్ లోని నలంద జిల్లా సొహర్సే పోలీస్ స్టేషన్ కు చెందిన సిబ్బందిగా వీరిని గుర్తించినట్టు తెలుస్తోంది. నడిరోడ్డుపై వీరు తగువులాడుకున్న తీరు అందరిని ఆశ్యర్యంలోకి ముంచెత్తింది. ఓ కేసు విషయంలో వచ్చిన మామూళ్లు పంచుకునే విషయంలో వీరిద్దరి మధ్య ఇంత రాద్దాంతం జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. అక్కడి పోలీసు అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు సమాచారం. అయితే వీరిద్దరి గొడవను గమనించిన స్థానికులు మీరిద్దరిని కూడా డిసిప్లేనరీ యాక్షన్ కింద సస్పెండ్ చేస్తారంటూ హెచ్చరిస్తున్నా వారు మాత్రం తగ్గేదేలా అన్నట్టుగా వ్యవహరించారు. చివరకు వారే ఇద్దరిని విడిపించడం కొసమెరుపు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు నెట్టింట్ వైర్ల అవుతున్నాయి.

https://twitter.com/TeluguScribe/status/1704091489104736647?t=VOPgTU40Jo5oK2F4kyKljQ&s=19

You cannot copy content of this page