నిరుద్యోగ మార్చ్ కి అనుమతి… షరతులు పెట్టిన పోలీసులు

విమర్శలకు స్థానం లేదు

కండిషన్లతో కూడిన అనుమతి

దిశ దశ, వరంగల్:

బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే షరతులతో కూడిన అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. శనివారం జరపతలపెట్టిన ఈ నిరుద్యోగ మార్చ్ నిశ్శబ్దాన్ని మరిపించాల్సిన అవసరం ఉందని పోలీసులు ఇచ్చిన షరతులను గమనిస్తే స్పష్టం అవుతోంది. మొత్తం 17 కండిషన్లతో కూడిన అనుమతిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఇచ్చారు. డీజే సౌండ్స్ నిషేధించినందున బాక్స్ టైప్ స్పీకర్లను మాత్రమే ఉపయోగించాలని, మద్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మార్చ్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ మార్చ్ కు వచ్చే వారి వాహనాలు అన్ని కూడా హయగ్రీవాచారి (కూడా) మైదానంలో మాత్రమే పార్క్ చేయాలని, కాకతీయ యూనివర్శిటీ నుండి లైఫ్ట్ రోడు మాత్రమే మార్చ్ కోసం వినియోగించాలని స్పష్టం చేశారు. శాంతి సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నందున రెచ్చగొట్టే విధంగా ఉండే నినాదాలు ఇవ్వకూడదని, మతాన్ని, రాజకీయ పార్టీని ఇతర సంస్థలను, ప్రభుత్వాన్ని విమర్శంచకూడదని సూచించారు. అలాగే ర్యాలీ సందర్భంగా సమావేశాలు, ప్రసంగాలు చేయకూడదని, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యకలాపాలకు ఆటంకం కల్లించకూడదని, ఇలాంటి ఏదైనీ చర్య జరిగినట్టయితే అనుమతి రద్దు చేస్తామని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కూడా పర్మిషన్ లెటర్లో స్పష్టం చేశారు. సంస్థలపై కాని, ప్రభుత్వం, రాజకీయా పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, మార్చ్ లో పాల్గొనే వారి వద్ద మరణాయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు సౌండ్ సిస్టం, నినాదాలు ఆపి వేయాలని, రంజాన్ మాసం అయినందున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునే సమయం అయినందున సైలెంట్ గా ఉండాలని సూచించారు. ఊరేగింపు మార్గంలో విద్యా సంస్థలు. ఆసుపత్రులు ఉన్నందున నిరుద్యోగ మార్చ్ నిర్వాహకులు అందులో పాల్గొనేవారు విద్యా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా ఫిర్యాదు చేసినా తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని పర్మిషన్ లెటర్ లో వెల్లడించారు.

పోలీసులు ఇచ్చిన కండిషన్లతో కూడిన పర్మిషన్ లెటర్

You cannot copy content of this page