ప్రగతి భవన్ TO ఫాం హౌజ్…

ప్రత్యేకంగా చండి, రాజశ్యామల హోమాలు…

దిశ దశ, సిద్దిపేట:

రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు ఎన్నికల సమీకరణాలు మూడు రోజుల పాటు ఎర్రవెల్లి ఫాం హౌజ్ వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రగతి భవన్ నుండే రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన సీఎం కేసీఆర్ బుధవారం నుండి ఫాంహౌజ్ లో బస చేయనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసుకున్న బీజీ షెడ్యూల్ లోనూ ఆయన ఫాంహౌజ్ కు చేరుకుని ప్రత్యేకంగా చండి హోమంతో పాటు రాజ శ్యామల యాగం చేయాలని సంకల్పించారు. మూడు రోజుల పాటు జరగునున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం కళశ గణపతి పూజచ బ్రాహ్మణులకు రుత్విక్ వరణం నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ పర్యవేక్షించనున్నట్టు సమాచారం. మూడో రోజు జరగనున్న పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరు కానున్నారు.

ఓన్లీ ఫ్యామిలీ…

అయితే ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో జరుగనున్న మూడు రోజుల పాటు ఈ యాగానికి కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావాలని నిర్ణయించారు. ఇతరులకు అనుమతి ఇవ్వకూడదన్న ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. మీడియాతో పాటు పార్టీ శ్రేణులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకు రానివ్వకూడదని, సీఎం కుటుంబం ఇచ్చే జాబితాలో ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించాలని స్పష్టం చేసినట్టు సమాచారం.

అప్పుడలా…

అయితే 2018 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిత చండి యాగంతో పాటు రాజ శ్యామల యాగం అంగరంగ వైభవంగా నిర్వహించిన తరువాత ముందస్తు ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఈ సారి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారంలో మునిగి తేలుతున్న క్రమంలో రాజశ్యామల యాగంతో పాటు చండి హవనం నిర్వహించేందుకు సమాయత్తం కావడం చర్చనీయాంశంగా మారింది. రెండు మూడు రోజుల క్రితం నుండే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులకు ఆహ్వానాలు అందడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాల్లో పార్టీ శ్రేణులు మునిగిపోవడంతో పాటు నామినేషన్ల దాఖలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం విశేషం.

You cannot copy content of this page