ప్రణిత్ రావు కస్టడీకి నో అన్న కోర్ట్: ఆ ఇద్దరికి ఐదు రోజులకు అనుమతి

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ముగ్గురు పోలీసు అధికారులను కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారులు పెట్టుకున్న పిటిషన్ పై కోర్టు విచారించింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రణిత్ రావును కస్టడీకి ఇచ్చే విషయాన్ని మాత్రం కోర్టు తోసిపుచ్చింది. రిమాండ్ చేసిన 14 రోజుల లోపునే కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంటుందని, ఆ తరువాత కస్టడీకి ఇవ్వకూడదంటూ వివిధ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లను ప్రణిత్ రావు తరుపు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో కోర్టు ప్రణిత్ రావును మళ్లీ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించలేదని తెలుస్తోంది.

ఇద్దరి విచారణ…

మరో వైపున ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు అధికారులు విచారణ చేస్తున్నారు. రాధాకిషన్ రావు, గట్టుమల్లు అనే ఇద్దరు పోలీసు అధికారులను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తున్నట్టు సమాచారం. మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. అధికారికంగా ఈ విషయంపై ప్రకటన వెలువడాల్సి ఉంది.

You cannot copy content of this page