ప్రిన్సిటన్ లో మానవ అక్రమ రవాణా స్కాం… దాడులు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితుల్లో తెలుగు వారు…

దిశ దశ, అంతర్జాతీయం:

మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని అమెరికాలోని టెక్సాస్ ప్రిన్సిటన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నిందితులుగా ఉండడం సంచలనం కల్గిస్తోంది. అమెరికాలోని ఎన్ఆర్ఐ వర్గాల్లో పెద్ద ఎత్తున ఈ క్రైం గురించి చర్చ సాగుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల తెలుగు వారు ఉండడం అక్కడి పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయంపై ఎన్ఆర్ఐలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ మేరకు జులై 8న ప్రిన్సిటన్ పోలీసులు ప్రెస్ రిలీజ్ చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి… ఈ ఏడాది మార్చి 13న మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గిన్స్ బర్గ్ లేన్ లోని 1000 బ్లాక్ లోని ఓ నివాసంలో పోలీసులు సోదాలు చేపట్టారు. అనుమానస్పద పరిస్థితులను గమనించిన ప్రిన్సిటన్ సీఐడీ డిటెక్టివ్ పోలీసులు సంతోష్ కట్కూరి ఇంటిని సెర్చ్ చేసేందుకు వారెంటు తీసుకుని సోదాలు చేపట్టారు. ఈ ఘటనలో 15 మంది బాధితులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సంతోష్ కట్కూరి, ద్వారాకా గుండాలు షెల్ కంపెనీల్లో బాధితులచే బలంవంతంగా పనిచేయించుకుంటున్నారని గుర్తించారు. ప్రిన్సిటన్,మెలిస్సా, మెకిన్నేలతో పాటు పలు ప్రాంతాల్లో బలవంతంగా శ్రమ దోపిడీ చేస్తున్నారని దర్యాప్తు అధికారులు విచారణలో తేల్చారు. ప్రిన్సిటన్ లోని నివాసం నుండి ల్యాప్ టాప్ లు, సెల్్ ఫఓన్లు, ప్రింటర్లు, నకిలీ పత్రాలను పోలీసులు సీచ్ చేయగా, ఇతర ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు అక్కడ కూడా ల్యాప్ టాప్స్, సెల్ ఫోన్లు, డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించిన తరువాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్దారించినట్టుగా పోలీసులు తెలిపారు. వీరు మానవ అక్రమ రవాణా, సెకండ్ డిగ్రీ ఫెలోనీతో అభియోగాలపై నలుగురికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కేసును మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించిన ప్రిన్సిటన్ పోలీసులు నిందితుల క్రిమినల్ చర్యల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా తెలియజేయాలని సూచించారు. 972-736-3901 లేదా 9-1-1 నంబర్లకు డయల్ చేసి వివరాలు అందించాలని కోరారు. పోలీసులు నిందితులుగా పేర్కొన్న వారిలో చందన్ దాసిరెడ్డి (24), ద్వారకా గుండా (31), సంతోష్ కట్కూరి (31), అనిల్ మాలే (37)లు ఉన్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో సుమారు 100 మందిపై బాధితులు ఉంటారని వీరిలో సగం మందిని గుర్తించినట్టు ప్రిన్సిటన్ పోలీసులు వివరించారు.

You cannot copy content of this page