ఖైదీ నంబర్ @ 7691

దిశ దశ, ఏపీ బ్యూరో:

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఆదివారం రాత్రి 1.20 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం రాత్రి చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును రోడ్డు మార్గం గుండానే పోలీసులు రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో సెక్షన్ 409 వర్తించదని వాదించినప్పటికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అంగీకరించలేదు… ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడడంతో జ్యుడిషియలర్ రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తరువాత చంద్రబాబు నాయుడును రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి తీసుకెళ్లిన పోలీసులు రాత్రి 1.20 గంటలకు రాజమండ్రి జైలుకు చేర్చారు. ఆయనకు జైలులో స్నేహ బ్లాక్ లో 7691 ఖైదీ నంబర్ అలాట్ చేశారు. జైలు సమీపంలోకి చేరుకోగానే పోలీసులు చంద్రబాబు నాయుడును మాత్రమే జైలు లోపలకు తీసుకెళ్లి ఆయన వెంట వెళ్లిన వారందరిని కూడా నిలువరించారు. ఆ తరువాత జైలు అదికారుల అనుమతితో నారా లోకేష్ ను లోపలకు వెల్లేందుకు అనుమతించారు.

ప్రత్యేక సౌకర్యాలు…

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఏసీబీ న్యాయ స్థానం ఆదేశించింది. ఆయన వయసు, ఆరోగ్య రిత్యా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడంతో పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం రాత్రి ఇచ్చిన ఈ ఆదేశాల ప్రకారం ఆయనకు ప్రత్యేక గది, మందులు, వైద్య చికిత్స, ఇంటి నుండి ఆహారం తీసుకునేందుకు అనుమతించాల్సి ఉంటుంది.

బెయిల్ పై విచారణ…

మరో వైపున సోమవారం చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ తో పాటు… సీఐడీ అధికారులు వేసిన కస్టడి పిటిషన్ పై కూడా కోర్టులో విచారణ జరిగనుంది. అలాగే టీడీపీ లీగల్ సెల్ హై కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసేందుకు సమాయత్తం అవుతోంది. చంద్రబాబు నాయుడును విచారించేందుకు సీఐడీ సిట్ అధికారులు వేసిన కస్టడి పిటిషన్ అనుమతి ఇస్తారా లేక బెయిల్ పై విడుదల చేస్తారా అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.

You cannot copy content of this page