దిశ దశ, హుజురాబాద్:
కరీంనగర్ జడ్పీ సమావేశంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో తనపై నమోదు చేసిన కేసుపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. వీణవంక మండల కేంద్రంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో హుజురాబాద్ సమస్యలు అడిగితే తప్పా అని ప్రశ్నించారు. తాను ఎవరినీ అడ్డుకోలేదని, ఎవరిని అడ్డుకున్నానో చూపించాలని డిమాండ్ చేశారు. తన విధులకు ఆటంకం కల్గించారని కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేస్తానని, జడ్పీ సీఈఓ, డీఈఓలపై ప్రివిలేజ్ మూవ్ చేస్తానని స్ఫష్టం చేశారు. ప్రజా గొంతుకగా ప్రజా సమస్యలపై మాట్లాడితే తన గొంతు నొక్కాలనకుంటే అది మీ వల్ల కాదంటూ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ పేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో సౌకర్యాలపై ఏంఈఓలతో మీటింగ్ పెడితే డీఈఓ వారికి డిమోషన్ లెటర్ పంపించారని, ఎమ్మెల్యేగా సమీక్ష జరిపే అధికారం తనకు లేదా అని అడిగారు. కొత్త చట్టం ప్రకారం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుని, న్యాయవాదితో మాట్లాడి చట్టపరంగానే మూవ్ అవుతానని వెల్లడించారు.