మా నాన్నను ఎందుకు చంపావ్…?

నా తండ్రిని ఎందుకు చంపావంటూ ప్రియాంక గాందీ తనను ప్రశ్నించారని రాజీవ్ హత్య కేసులో దోషి నళిని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని కూడా చెప్పుకొచ్చారు. 31 ఏళ్ల తరువాత జైలు నుండి విడుదల అయిన ఆమె మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ప్రియాంక తనను కలిసినప్పుడు నా ప్రవర్తన ఆకట్టుకుందని వివరించారు. ఆనాటి దుర్ఘటనపై క్షమాపణలు కోరుతున్నానని, ఆ ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు ఎలాంటి మనోవేదనకు గురయ్యాయో అర్థం చేసుకున్నానని అయితే ఆనాటి బాధకర పరిస్థితుల నుండి ఆ కుటుంబాల దూరం అయ్యాయని భావిస్తున్నానన్నారు. అయితే తాను ఇక భవిష్యత్తులో తన భర్త శ్రీహరణ్, కూతురుతో కలిసి యూకెలో జీవించాలని అనుకుంటున్నాని వివరించారు. మరో వైపున తాను తప్పు చేయకున్నా దోషిగా గుర్తించారని, తన భర్త స్నేహితులు రాజీవ్ హత్య కేసులో భాగస్వాములు కావడం వల్లే తామీ పరిస్థితులు ఎదుర్కొవల్సి వచ్చిందని నళిని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏడు సార్లు మరణ శిక్ష అమలు చేసే పరిస్థితి నుండి వాయిదా పడిందని, 31 ఏళ్ల తరువాత జైలు జీవితం నుండి బయటకు వచ్చానని నళిని వివరించారు.

You cannot copy content of this page