దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణాలోని పలువురు డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్న కె శంకర్, డి ఉపేంద్ర రెడ్డి, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ లో పనిచేస్తున్న బి ప్రతాప్ రెడ్డి, ఎ విశ్వప్రసాద్, ఏసీబీలో పనిచేస్తున్న బి సాయికృష్ణ గౌడ్, డి కమలాకర్ రెడ్డి, అంబర్ పేట పీటీసీలో పని చేస్తున్న జి వెంకటేశ్వర బాబు, ఎం పిచ్చయ్య, ఇంటలీజెన్స్ లో పనిచేస్తున్న జె నర్సయ్య, నిజామాబాద్ సీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న బి కిషన్, టీజీపీఏలో పనిచేస్తున్న ఎంబీ మజీద్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏసీపీగా పనిచేస్తున్న జి బస్వారెడ్డి, సైబారాబాద్ సీఐ సెల్ ఏసీపీగా పనిచేస్తున్న కె పుల్లయ్యలకు నాన్ క్యాడర్ అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరంతా కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.