కరీంనగర్ కాంగ్రెస్ లో ముసలం…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మీకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ శ్రేణులు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని తమను పట్టించుకోవడం లేదని సీనియర్లు వాపోతున్నారు. బుధవారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో ఈ మేరకు సమావేశం జరిగింది. కరీంనగర్ కాంగ్రెస్ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్, తాజ్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఉన్నారు.

పురుమల్ల ఆవేదన…

ఈ సమావేశంలో కరీంనగర్ కాంగ్రెస్ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్ పలు అంశాలను వేదిక ముందు ఉంచినట్లుగా చూపుతున్నారు. ఇసుక రీచులతో పాటు ఇతరత్రా అన్ని విషయాల్లో తనకు తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయని. నువ్వే నియోజకవర్గ ఇంఛార్జివి, నువ్వే ఎమ్మెల్యేవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటే గ్రౌండ్ లెవల్లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులే అయినా, ప్రభుత్వ నిధుల కెటాయింపే అయినా ఇలా ప్రతి ఒక్కరికీ సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారని కామెంట్ చేశారు. తాను కరీంనగర్ ఇంఛార్జిగా ఉన్నట్టా లేనట్టా అన్న విషయమే అర్థం కాకుండా పోయిందని పురుమల్ల శ్రీనివాస్ కామెంట్ చేశారు. ఓ నాయకుని కుటుంబానికే అత్యధిక ప్రాధాన్యత దక్కుతోంది తప్ప పార్టీ శ్రేణులకు మాత్రం అవకాశం లేకుండా పోయిందని అన్నారు.

వారు దూరం…

కరీంనగర్ డీసీసీ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య నాయకులు దూరంగా వారి వర్గానికి చెందిన కేడర్ మాత్రం హాజరైనట్లుగా ఉంది.

You cannot copy content of this page