MLC Elections: అధికార పార్టీకి రెడ్ కార్పెట్… మాకు నో ఎంట్రీనా..?

ఎన్నికల అధికారి కార్యాలయం ముందు నిరసన

దిశ దశ, కరీంనగర్:

చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు కరీంనగర్ ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మరో సెట్ నామినేషన్ దాఖలు చేయగా రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ చీఫ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన వి నరేందర్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాహనాలను కార్యాలయ ఆవరణలోకి అనుమతించారని, ఇండిపెండెంట్ అభ్యర్థుల వాహనాలను మాత్రం లోపలకు వెళ్లనీయడం లేదని ఆరోపించారు. సర్దార్ రవిందర్ సింగ్ నామినేషన్ వేసేందుకు వెల్తున్న క్రమంలో పోలీసులు అతని వాహనాన్ని నిలువరించారు. దీంతో రవిందర్ సింగ్ తో పాటు ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ ఇండిపెండెంట్ అభ్యర్థులు అధికారుల తీరుపై విమర్శలు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థుల అనుచరులు కూడా అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

You cannot copy content of this page