దిశ దశ, సినిమా:
1987లో సంచలనం సృష్టించిన ఆ మూవీ మరోసారి విడుదలకు సిద్దమవుతోంది. ఈ మూకీ సినిమాలో హాస్యం పండించిన తీరు అద్భుతమనే చెప్పాలి. పలు భారతీయ భాషల్లో తీసిన ఈ చిత్రం రీ రిలిజ్ కు సిద్దమవుతోంది. కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం చిత్రం అప్పుడు చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమాను మళ్లీ వెండితెరపై చూపించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఆర్థిక పరిపుష్టి మాత్రం సాధించలేకపోయినా దక్షిణాదిన తీసిన చిత్రాలలో ప్రాధాన్యతను మాత్రం అందుకుంది. ఐఎండీబీలో 10కి 9.4 మార్కులు పొంది అత్యధిక మెరిట్ సాధించిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది. దరక్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ, సింగీతం శ్రీనివాస రావు సిద్దం చేయగా నిర్మాతలుగా సింగితం శ్రీనివాస రావుతో పాటు శ్రీంగర్ నాగరాజులు వ్యవహరించారు. అమల హిరోయిన్ గా, ఛాయగ్రహణం బి.సి. గౌరిశంకర్, సంగీతం ఎల్ వైద్యనాథన్, నిర్మాణ సంస్థ మందాకిని చిత్రా ప్రైవేట్ లిమిటెడ్, నవంబర్ 27 1987లో విడుదల అయింది ఈ మూవీ. 124 నిమిషాల నిడివితో తీసిన ఈ చిత్రం ఆ నాటి తరాన్ని విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో రెండున్నర దశాబ్దాల క్రితం నాటి సినిమాను మరోసారి ప్రేక్షకులు అస్వాదించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వైవిద్యమైన కథతో తీసిన ఈ సినిమాలో ట్విస్టుల మీదు ట్విస్టులు చోటు చేసుకోగా చిత్రం అసాంతం కూడా ఒక్క మాట కూడా లేకుండా తీయడమే అసలు స్పెషాలిటీ. మళ్లీ తెరంగ్రేటం చేయబోతున్న ఈ మూకీ సినిమాకు నేటి తరం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.