కార్యదర్శిగా లింగపెల్లి నాగరాజు
ఉత్కంఠత రేపిన ఫలితాలు
దిశ దశ, కరీంనగర్ లీగల్:
కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం జరిగాయి. రాత్రి 10 గంటలకు ఎన్నికల అధికారులు ఫలితాలు విడుదల చేశారు. 90 శాతంపైగా పోలింగ్ జరగడంతో పాటు బరిలో అభ్యర్థులు కూడా ఎక్కువ మంది ఉండడంతో ఎవరి తల రాతలు మారుతాయోనన్న చర్చలు జరిగాయి. తీవ్ర ఉత్కంఠత మద్య వెలువడిన ఫలితాల్లో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా భూపాల్ రావు రఘునందన్ రావు, ప్రధాన కార్యదర్శిగా లింగంపెల్లి నాగరాజులు ఎన్నికయినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రఘునందన్ రావు సమీప ప్రత్యర్థి రాజ్ కుమార్ పై 24 ఓట్ల తేడాతో గెలుపొందగా, ప్రధాన కార్యధర్శిగా సమీప ప్రత్యర్థి భేతి మహేందర్ రెడ్డిపై 12 ఓట్లతో గెలిచారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వెలువడే వరకూ కూడా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. చివరకు రఘునందన్ రావు అధ్యక్షునిగా గెలిచినట్టు ఎలక్షన్ ఆఫీసర్స్ ప్రకటించారు.
