రాహుల్ గాంధీ @ స్ట్రీట్స్

దిశ దశ, హైదరాబాద్:

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి విడుత బస్సు యాత్ర ముగిసింది. ములుగు జిల్లా రామప్ప నుండి ప్రారంభించిన ఈ బస్సు యాత్రం నిజామాద్ జిల్లా ఆర్మూర్ వరకు సాగింది. అనంతరం జాతీయ సమీకరణాలకు సంబందించిన కీలక సమావేశానికి హాజరు కావల్సి ఉన్న నేపథ్యంలో ఆయన న్యూ ఢిల్లీ వెల్లిపోయారు. రెండో విడుత యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను కాంగ్రెస్ వర్గాలు త్వరలో ప్రకటించనున్నాయి.

అంతా స్ట్రీట్సే…

రాహుల్ గాంధీ పర్యటన అంతా కూడా స్ట్రీట్స్ మీదుగానే సాగింది. ఐదు జిల్లాల్లో జరిపిన ఈ పర్యటనలో ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయా కేంద్రాల్లో స్థానిక నాయకత్వం ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కాకుండా ములుగు జిల్లా రామంజపురం, పెద్దపల్లి, ఆర్మూర్ లలో మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన బస్సు యాత్రలో గమ్యం చేరేందుకు మాత్రమే ప్రయాణించారు. దాదాపు ప్రతి చోట కూడా రహదారుల మీదుగా నడుచుకుంటూ వెల్లేందుకు ప్రయత్నించారు. జగిత్యాలకు చేరుకున్న తరువాత రాహుల్ గాంధీ వాహనంపై నుండి ప్రసగించడానికే సరిపెట్టకుండా ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేశారు. స్ట్రీట్ ఫుడ్ వాలా వద్దకు వెల్లి ఆయనే స్వయంగా దోశ వేసి కాంగ్రెస్ శ్రేణులను ఆశ్యర్యపరిచారు. అంతేకాకుండా తాను వేసిన దోశను టిపిన్ సెంటర నిర్వాహకునికి తినిపించి తాను కూడా తిన్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న ప్రయాణీకులతో మాట్లాడిన రాహుల్ గాంధీ వారితో కలిసి టిఫిన్ చేయడం విశేషం. ఇలా ఆయన పర్యటనలో ఎక్కువ శాతం స్ట్రీట్స్ కే ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. ఎప్పుడూ కాంగ్రెస్ నాయకులు, సెక్యూరిటీ నడుమ ఉండే రాహుల్ గాంధీ సామాన్యులతో కలిసిపోయిన తీరు ఆకట్టుకుంది.

You cannot copy content of this page