దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో రెండు రోజులుగా ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. శనివారం కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయలేదని టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. కిచెన్ లో పరిశుభ్రమైన వాతావరణం లేకుండా పోయిందని, సాలె పురుగులు, ధూళీ వంటివి వంట గదిలో విస్తరించాయని అధికారులు గమనించారు. ఫుడ్ హ్యండర్ల మెడికల్ ఫిటినెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేవని, ఆహార పదార్థాల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్టుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం కూడా కరీంనగర్ లోని మిఠాయి వాలా స్వీట్ హౌజ్ లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు పలు లోపాలను గుర్తించారు. వీటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
https://x.com/cfs_telangana/status/1845027139961151841