రాజన్న జిల్లాలోనూ అదే వరస… కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభసా…

కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం రసాభసాగా సాగింది. ముఖ్య నేతల ముందే పార్టీ శ్రేణులు వేదికపైకి వచ్చి మరీ తమ నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ప్రసంగిస్తుండగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సిరిసిల్లలో పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయిందని, నాయకత్వ వైఫల్యం ఉందని ఉమేష్ రావు చేసిన వ్యాఖ్యలతో సమావేశంలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. దీంతో వేదిక ముందు ఉన్న పార్టీ శ్రేణులు వేదికపైకి ఎక్కి ఉమేష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా వారిపై ఎదురుదాడిగి దిగడంతో సమావేశం అంతా రసాభసాగా మారిపోయింది. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ పెరుమాళ్ కూడా హాజరైన ఈ సమావేశంలోనూ గందరగోళం నెలకొనడం విస్మయపరిచింది. ఉమేష్ రావు వేదిక మీద నుండి దిగదాలని, ఏనాడూ పార్టీ కోసం పనిచేయని ఆయనను వేదికపై ఎలా పిలిచారంటూ పార్టీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాగ్వాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఇతర నాయకులు చొరవ తీసుకోవడంతో పార్టీ శ్రేణులు శాంతించాయి. ఆ తరువాత సమావేశం యథావిధిగా కొనసాగింది.

You cannot copy content of this page