ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం… కేజ్రీవాల్ ఆగ్రహం…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

నేషనల్ క్యాపిటర్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ 2023 సవరణ బిల్లును రాజ్య సభ ఆమోదించింది. 131 ఓట్లు అనుకూలంగా పడగా, 102 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. మెజార్టీ సభ్యుల ఆమోదంతో బిల్లు పాస్ అయింది. ఈ బిల్లు ఆమోదంతో ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం ఇక నుండి కేంద్రానికి ఉండనుంది. చాలా అధికారాలు కేంద్రం ఆధీనంలోకి వెళ్లనున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కొన్ని శాఖల విషయంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.

కేజ్రీవాల్ ఆగ్రహం…

గతంలో ఢిల్లీ అభివృద్దికి అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రకటించిన ప్రధాని మోదీ వెన్నుపోటు పొడిచారంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ సి టి బిల్లును రాజ్యసభ ఆమోదించిన తరువాత ఆయన స్పందిస్తూ ఇది ఢిల్లీ ప్రజలకు బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రజా స్వామ్యానికి విరుద్దంగా రాష్ట్ర హక్కులను హరించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.

You cannot copy content of this page