రాష్ట్రంలో రామ రాజ్యం… మోడీ రాజ్యం

ప్రధాని విధానాలు నచ్చి వస్తే అక్కున చేర్చుకుంటాం

పార్టీ బలోపేతానికి ఎవరి పని వాళ్లు చేస్తారు

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు


దిశ దశ, కరీంనగర్:

రాష్ట్రంలో రాబోయిేది రామ రాజ్యం, మోడీ రాజ్యం… పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. ప్రధాని మోడీ విధానాలు నచ్చి వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలోకి ఇతర పార్టీల నుండి వచ్చే వారిని ఎవరైనా ఆహ్వానించవచ్చని, ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తుంటారని, ఒక్కడే ఈ పనులు చేయడం సాధ్యం కాదన్నారు. ఖమ్మం జిల్లా నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలో చేరాలని ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లారు కదా దీనిపై మీ కామెంట్ ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు, మంచి వ్యక్తి పొంగులేటి వంటి వారు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించేందుకు బీజేపీవైపు మొగ్గు చూపే ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఈటల రాజేందర్ పొంగులేటి ఇంటికి వెల్లే విషయం తనకు తెలియదని, తన ఫోన్ అందుబాటులో లేనందున సమాచారం అందలేదన్నారు. అయితే తనకు చెప్పకుండా వెల్లడం కూాడా తప్పేం కాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కర్ణాటక కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్పాన్సర్ షిప్

కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యే ఎలక్షన్లపై స్పందించిన బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై దుయ్యబట్టారు. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ జేడీఎస్ కు చేయిచ్చి చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అధినేత స్పాన్సర్ షిప్ చేస్తున్నాడని ఆరోపించారు. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే మహారాష్ట్ర ప్రచరాం చేస్తున్నాడంటూ ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో విపత్తుల సమయంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా నిధులు కెటాయింస్తున్నవా వాటిని కూడా రైతుల సంక్షేమం కోసం వినియోగించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. వడగండ్లతో కష్టాల పాలైన రైతులను ఆదుకునేందుకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటికీ సాయం అందించలేదన్నారు. ప్రతిపాదనలు చేస్తూ అందులో పరిహారం అందించే వారి జాబితాను తగ్గించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయం అన్ని కేంద్రమే సమకూరుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంలో విఫలం అయిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాలకు పంట నష్టం వాటిల్లిందన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ నాయకులు బండ రమణారెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సొల్లు అజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page