రామగుండం సీపీ రిలీవ్ కు ఆదేశం: ఇంఛార్జిగా ఐజీపీ తరుణ్ జోషి

దిశ దశ, రామగుండం:

రామగుండం పోలీస్ కమిషన్ రెమా రాజేశ్వరిని విధుల నుండి రిలీవ్ కావాలని డీజీపీ రవిగుప్త ఆదేశాలు జారీ చేశారు. జనవరి 3న బదిలీలకు సంబంధించిన జీఓలో రెమా రాజేశ్వరిని బదిలీ చేశారు. అయితే అమె స్థానంలో నియమించిన ఎల్ ఎస్ చౌహాన్ విధుల్లో చేరాల్సిన పరిస్థితులు లేకపోవడంతో ఆయన జాయిన్ కాలేదు. దీంతో రెమా రాజేశ్వరీ యథావిధిగా కొనసాగుతున్నారు. తాజాగా గురువారం డీజీపీ రవిగుప్త మెమోరాండం పంపించారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా జనవరి 3న వెలువడిన ఉత్తర్వులలో నియమించడం జరిగిందని, ఆ ఉత్తర్వుల మేరకు రామగుండం బాధ్యతల నుండి రిలీవ్ అయి కొత్తగా పోస్టింగ్ అయిన చోట విధుల్లో చేరాలని ఆదేశించారు. తాత్కాలికంగా రెండో మల్టిజోన్ ఐజీపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణ్ జోషిని నిర్వహించాలని ఆ లేఖలో డీజీపీ కోరారు. దీంతో రామగుండం సీపీ బాధ్యతల నుండి రెమా రాజేశ్వరి నేడో రేపో రిలీవ్ కానున్నారు.

You cannot copy content of this page